Kaleshwaram | కేసీఆర్‌ సూచనల మేరకే కాశేళ్వరం నిర్మాణం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ పీ. చంద్రఘోష్ వేగవంతం చేశారు

  • Publish Date - June 15, 2024 / 05:15 PM IST

విచారణలో ఇంజనీర్ల వెల్లడి
కాళేశ్వరం అక్రమాల విచారణలో పీసీ ఘోష్‌ కమిషన్‌ దూకుడు
జూలైలో కేసీఆర్‌ హరీశ్‌రావుల విచారణ
కాళేశ్వరం సబ్‌ కాంట్రాక్టర్ల గుర్తింపు

విధాత, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ పీ. చంద్రఘోష్ వేగవంతం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులను విచారణ చేస్తున్నారు. రిటైర్డ్ ఇంజనీర్ల బృందం ఈరోజు శనివారం కాళేశ్వరం కమిషన్‌ను కలిసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అక్కడే ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ సూచనల మేరకే పనులు చేసినట్లు కమిషన్‌కు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ సమర్పించింది. అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్లను విచారణకు పిలిచి వారి నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో కాళేశ్వరం కమిషన్ దృష్టి సారించింది. అఫిడవిట్ పరిశీలన తర్వాత ఓపెన్ కోర్టులోనే మరోసారి అందరిని కాళేశ్వరం కమిషన్ క్రాస్ ఎగ్జామినింగ్ చేయనున్నట్లు సమాచారం.

మూడు బ్యారేజీల సబ్ కాంట్రాక్టర్లను కాళేశ్వరం కమిషన్ గుర్తించే పనిలో పడింది. సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. ఏజెన్సీలను అఫిడవిట్ ఫైల్ చేయమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. ఆ అఫిడవిట్లపై విచారణ కొనసాగుతోందని వివరించారు. టెక్నికల్ అంశాలు సిద్ధమైన తర్వాత ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇస్తామని తెలిపారు. జూలై రెండో వారం లేదంటే ఆ తర్వాత విచారణకు మాజీ భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని విచారణకు పిలుస్తామనిపిలుస్తామని చంద్రఘోష్ తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలో నోటీసులు జారీ చేస్తామని పేర్కోన్నారు.

Latest News