Site icon vidhaatha

K Keshav Rao | ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కేకే

హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

విధాత, హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు, సీనియర్ నేత కే. కేశవరావు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీల సమక్షంలో బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ కే.సీ.వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ,పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్‌లు కూడా ఉన్నారు. బీఆరెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకే మే నెలలోనే బీఆరెస్‌కు రాజీనామా ప్రకటించి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా తెలిపారు. తన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లుగా ప్రకటించారు. బుధవారం ఢిల్లీలో కేకేను కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ప్రియాంకగాంధీ కూడా ఫోన్‌లో ఆయనను ఆహ్వానించారు. అనంతరం మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో అధికారికంగా చేరిపోయారు. అయితే కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత రాలేదు

Exit mobile version