K Keshava Rao | రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేకే

బీఆరెస్‌ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్‌ నేత కే. కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు

చైర్మన్‌ ధన్కడ్‌కు లేఖ

విధాత : బీఆరెస్‌ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్‌ నేత కే. కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తనట్లు రాజ్యసభ చైర్మన్ జగదీష్‌ ధన్కడ్‌కు లేఖ అందజేశారు. కాగా కేకే రాజీనామాతో ఆ రాజ్యసభ స్థానం కాంగ్రెస్‌కు దక్కనున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్‌ నుంచి కూడా ఆయననే రాజ్యసభ సభ ఎన్నిక రేసులో ఉన్నట్లుగా సమాచారం.