Site icon vidhaatha

MLA Prem Sagar Rao | కాంగ్రెస్ నేతలతో ఖర్గే భేటీ.. అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్!

MLA Prem Sagar Rao |  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలంగాణకు చేరుకున్నారు. రావడంతోనే హోటల్ తాజ్ కృష్ణ లో పలువురు నాయకులతో సమావేశమయ్యారు. విడివిడిగా భేటి అయిన వారిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వి.సి అల్దాస్ జానయ్య, విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ దంపతులు, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్, రాంమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో చేపట్టిన విద్య సంబంధ అభివృద్ధి, నూతన విధానాలు, ఫీజు రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై విసి జానయ్య, విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి లతో ఖర్గే చర్చించారు. అలాగే, ఇటీవల మంత్రి పదవి ఆశించిన పలువురు నేతలు తమ విజ్ఙప్తులు చెప్పుకున్నట్టు సమాచారం. కొందరు తమ జిల్లాకు మంత్రిపదవుల్లో ప్రాతినిధ్యం లేదని పలువురు ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. కాగా, పార్టీ నాయకులతో విడివిడిగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఖర్గేతో భేటీ కోసం వచ్చిన మంచిర్యాల్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి వర్గంలో చోటు కల్పించలేమని ఖర్గే చెప్పడంతో అలిగివెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మంత్రి పదవికి బదులు చీఫ్ విప్ పదవి ఆఫర్ చేయగా ప్రేమ్ సాగర్ తిరస్కరించినట్లు దీంతో ప్రేమ్ సాగర్ రావును డిప్యూటీ సీఎం భట్టి బుజ్జగించినట్లు సమాచారం. అయితే, శుక్రవారం గ్రామస్థాయి కాంగ్రెస్‌ అధ్యక్షులతో నిర్వహించే సామాజిక న్యాయ సమర భేరి సభకు హాజరయ్యేందుకు ఖర్గే హైదరాబాద్ వచ్చారు.

Exit mobile version