బీజేపీది ధన బలం కాంగ్రెస్ ది జన బలం: కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య

బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ కు ధన బలం ఉంటే కాంగ్రెస్ పార్టీకి జన బలం ఉందని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు

  • Publish Date - April 21, 2024 / 04:59 PM IST

– కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలి

విధాత, వరంగల్ ప్రతినిధి : బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ కు ధన బలం ఉంటే కాంగ్రెస్ పార్టీకి జన బలం ఉందని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు. హన్మకొండలో ఆదివారం నిర్వహించిన వర్దన్నపేట నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గాలిలో అధికారం లోకి రాలేదు… సంస్థాగత నిర్మాణంతో, పార్టీ కార్యకర్తల కృషితో అధికారంలోకి వచ్చామన్నారు. ఇది పార్టీ మీటింగ్ లా లేదు కుటుంబ సభ్యుల సమావేశంలా ఉందన్నారు.

బిజెపి అభ్యర్థి వర్దన్నపేటలో గత ఏళ్లలో ఎన్ని అరాచకాలు చేసాడో మనందరికీ తెలుసన్నారు. మరోసారి అవకాశం వస్తే వర్దన్నపేట మొత్తాన్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాడని మండిపడ్డారు. అరూరి రమేష్ ధన బలంతో వీర్రావిగుతున్నాడు కానీ కాంగ్రెస్ ప్రజా బలం దెబ్బ మరోసారి రుచి చూపించాలని కోరారు. మీ నియోజకవర్గ ఆడబిడ్డగా నన్ను ఆదరించాలని కోరారు. బూత్ స్థాయిలో ప్రతీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని విన్నవించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలని పిలుపునిచ్చారు. రానున్న 25రోజులు పార్టీ కోసం, నా కోసం కష్ట పడండంటూ కోరారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని బిజెపి తప్పుడు ప్రచారం చేస్తుందని వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద ఉందన్నారు. పదేళ్లు బిజెపి అధికారంలో ఉండి దేశానికి చేసింది ఏమీ లేదని, మోడీ మాటలకు చేతలకు పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా డీసిసి అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, డీసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు, దొమ్మాటి సాంబయ్య, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest News