Kaleshwaram Commission| కాళేశ్వరం కమిషన్ గడువు మళ్లీ పెంపు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటు, నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్‌ను ఏర్పాటు చేసినవ విషయం తెలిసిందే

Kaleshwaram Commission | విధాత, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటు, నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్‌ను ఏర్పాటు చేసినవ విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం రెండు సార్లు విచారణ తేదీని పొడిగించించింది. మొదట వంద రోజుల్లో నివేదికను ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నా అనేక కారణాల వల్ల సాధ్యపడలేదు. దీంతో జూలై 31 వరకు గడువును పొడిగించింది. తాజాగా ఈ తేదీని కూడా పెంచుతూ వచ్చే నెల 3 వరకు గడువుపెట్టింది.

కాగా పీసీ ఘోష్ నేతృత్వంలో చేపట్టిన విచారణ తుది అంకానికి చేరకుంది. దీంతో విచారణకు సంబంధించిన తుది నివేదకను సీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి అందించేందుకు కమిషన్ సిద్ధమైంది. అయితే నివేదిక ఇరిగేషన్ శాఖకు సమర్పించే ముందు ఘోష్ న్యాయపరమైన అంశాలను పరీశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 3తో పీసీ ఘోష్ కమిషన్ విచారణ గడువు ముగియనుంది. ఆ రోజు ఆదివారం అవుతుండటంతో అంతకు ముందు రోజు అంటే శనివారమే ప్రభుత్వానికి తుది నివేదిక అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం.