విధాత, హైదారాబాద్ : ఫార్ములా-ఈ కార్ కేసులో ఏమీ లేదన్న విషయం అందరికీ తెలుసు అని..నన్ను అరెస్టు చేసే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డి చేయబోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా-ఈ కార్ కేసులో తప్పు చేయలేదని వంద సార్లు చెప్పానని..లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధం అని ఇప్పటికే అనేకసార్లు ప్రకటించానన్నారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అనుమతించిన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన దీనిపై స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఈ రేస్ కేసులో ఏమీ లేదని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అన్నారు. తాము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామని.. అన్ని లెక్కలు తేలుస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. దేశంలోనే ఇంత అక్రమ బంధం ఎక్కడా ఉండదని కేటీఆర్ విమర్శించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తున్నారు
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే పరువు పోతుందని రాజీనామాకు అవకాశం ఇస్తున్నారని, దానం నాగేందర్‌తో రాజీనామా చేయిస్తారని కేటీఆర్ తెలిపారు. దానంతో రాజీనామా చేయిస్తామని మావాళ్లతో అన్నారు. సాంకేతిక సాకులతో కడియం శ్రీహరిని కాపాడే అవకాశం ఉందేమోనని చూస్తున్నారు అని కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ ఎన్నికలొస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.
