చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్
ఎక్స్‌లో మాజీ మంత్రి పోస్ట్
విధాత, హైదరాబాద్ : సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ బిజెపిలో విలీనం అవుతుందంటూ నిరాధారమైన వార్తలు వ్యాప్తి చేస్తున్నారని, ఆధారాలు లేకుండా ప్రసారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు హెచ్చరిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. గత 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు.. కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ తమదన్నారు. ఇవన్నీ దాటుకు నిబద్ధతతో పోరాడి తెలంగాణ సాధించామన్నారు.
సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్రప్రదాన నిలిపామన్నారు. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైందన్నారు. ఎప్పటిలానే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది.. పోరాడుతుందన్నారు. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను దుష్ప్రచారాలని మానుకోవాలని, పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం… కానీ తలవంచం.. ఎన్నటికైనా ఎప్పటికైనా అంటూ ఎక్స్ లో రామారావు స్పష్టం చేశారు.