KTR Meets KCR : కేసీఆర్ ఫామ్ హౌస్ కు కేటీఆర్..జూబ్లీహిల్స్ ఫలితంపై చర్చ!

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కేటీఆర్, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు మరియు కవిత వ్యాఖ్యలపై కీలక చర్చలు జరిపినట్లు సమాచారం.

KTR Meets KCR at Erravalli farm house

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై కేసీఆర్ తో కేటీఆర్ సమీక్షించనున్నారు.

కేటీఆర్, హరీష్ రావులపై బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కవిత తాజాగా చేసిన సంచలన విమర్శల నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ భేటికి ప్రాధాన్యత నెలకొంది. ఈ భేటీలో వారద్దరి మధ్య కవిత అంశం చర్చకు రావచ్చని తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటమి ఓ వైపు..కవిత ఆరోపణలు మరోవైపు బీఆర్ఎస్ లో తాజాగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ భేటీ అంశం హాట్ టాపిక్ గా మారింది.