విధాత, హైదరాబాద్ : భారీ వర్షాలు..వరదల ధాటికి హైదరాబాద్ కు మంచినీటిని సరఫరా చేసే మంజీరా ఫిల్టర్ బెడ్ నీటి మునిగింది. ఒక పంప్ హౌస్, సబ్ స్టేషన్ ముంపుకు గురైంది. దీంతో 30ఎంజీడీల నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పంపులతో అధికారులు నీటిని తోడే పనులు ప్రారంభించారు. ఫిల్టర్ బెడ్ మునగడంతో హైదరాబాద్ ను తాగునీటి సరఫరా సమస్య ఏర్పడే ప్రమాదం నెలకొంది.
25ఏళ్ల తర్వాతా ఇంత భారీ ఎత్తున వరద వచ్చిందని..ఒకేసారి సమీపంలోని మూడు వాగులు ఉప్పొంగడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో ఫిల్టర్ బెడ్ పునరుద్దరిస్తామని తెలిపారు. మెదక్, వికారాబాద్ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో వాగులు ఉప్పొంగాయని అధికారులు చెబుతున్నారు.
