Mee Seva | ఇక వాట్సాప్ లోనే ‘మీ సేవ’లు!

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదేపదే మీ-సేవ సెంటర్లకు వెళ్లకుండా ఆ సేవలన్నీ వాట్సాప్ ద్వారానే అందించనుంది. మీ-సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం అందుకు సంబంధించిన అన్ని అప్‌డేట్స్ వాట్సాప్ లోనే చెక్ చేసుకోవచ్చు.

విధాత, హైదరాబాద్ :

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదేపదే మీ-సేవ సెంటర్లకు వెళ్లకుండా ఆ సేవలన్నీ వాట్సాప్ ద్వారానే అందించనుంది. మీ-సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం అందుకు సంబంధించిన అన్ని అప్‌డేట్స్ వాట్సాప్ లోనే చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన సర్టిఫికెట్ ఆమోదం పొందిందా? లేదా? అప్రూవ్ అయితే సర్టిఫికెట్‌ను వాట్సాప్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మంగళవారం ఈ సేవలను ప్రభుత్వం అధికారికంగా లాంచ్ చేయనున్నది.

కాగా, ప్రభుత్వానికి సంబంధించి ఏది అప్లై చేయాలన్నా మీసేవకు వెల్లాల్సి ఉంటుంది. కులధృవీకరణ, ఆదాయం, నివాసం లాంటి అనేక సేవలు మీ సేవ ద్వారా అందుతున్నాయి. అయితే, వాటికి సంబంధించిన అప్రూవల్స్, ఆమోదం పొందిందా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే కాస్త కష్టంగా ఉండేది. ప్రతిసారి మీ సేవ సెంటర్ కు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వాట్సాప్ ద్వారా మీ సేవకు సబంధించిన సర్వీస్ లు చెక్ చేసుకోవడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.