Site icon vidhaatha

Metro Rail | హైద‌రాబాదీల‌కు గుడ్‌న్యూస్.. మెట్రో రైళ్ల స‌మ‌యం పొడిగింపు

metro-passengers

Metro Rail | హైద‌రాబాద్ : రాజ‌ధాని ప్ర‌యాణికుల‌కు మెట్రో శుభ‌వార్త వినిపించింది. ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు వేళ‌ల్లో మార్పులు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాత్రి 11 గంట‌లకు చివ‌రి రైలు ఉండ‌గా, ఇక నుంచి రాత్రి 11.45 గంట‌ల‌కు చివ‌రి రైలు అందుబాటులో ఉండ‌నుంది. అలాగే ప్ర‌తి సోమ‌వారం ఉద‌యం 5.30 గంట‌ల‌కే మెట్రో రైలు ప‌రుగులు పెట్ట‌నుంది. మిగ‌తా రోజుల్లో సాధార‌ణంగానే ఉద‌యం 6 గంట‌ల నుంచే మెట్రో రాక‌పోక‌లు కొన‌సాగించ‌నుంది. ఇటీవ‌ల ర‌ద్దీ పెరిగిన దృష్ట్యా ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం మెట్రో వేళ‌ల్లో మార్పులు చేసిన‌ట్టు స‌మాచారం. పొడిగించిన వేళ‌లు శుక్ర‌వారం రాత్రి నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని మెట్రో అధికారులు తెలిపారు.

Exit mobile version