విధాత, హైదరాబాద్ : ప్రధాని మోదీ చెప్పినట్లుగా తెలంగాణ కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిందని, రాష్ట్రంలో ఆర్‌ఆర్(రాహుల్, రేవంత్)ల ట్యాక్స్ నడుస్తుందన్న మాటల్లో వాస్తవం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొట్టిపారేశారు. నిజానికి దేశంలో నడుస్తున్నది కేవలం అదాని..అంబానీ ట్యాక్స్ మాత్రమేనని కౌంటర్ వేశారు. ప్రధాని మోదీ దేశ సంపదను అదాని..అంబానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. మోడీ ప్రధాని అయ్యాక అదాని కంపెనీ దేశంలో రెండో స్థానానికి ఎగిదిందని ఆరోపించారు. అవినీతిలో పతకాలు ఇస్తే కాంగ్రెస్‌కు గోల్డ్, బీఆరెస్‌కు సిల్వర్ మెడల్స్ ఇవ్వాలన్న మోదీ వ్యాఖ్యలను ఖండించిన వెంకట్‌రెడ్డి అసలు అవినీతి మెడల్స్‌లో ధ్రాని మోదీకి డైమండ్ మెడల్ ఇవ్వాలని విమర్శించారు. త ఏటీఏంగా మారిందని, రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతికి మారుపేరు కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు.