Site icon vidhaatha

పెద్ద మనసు చాటిన మంత్రి సురేఖ

రోడ్డుప్రమాద బాధితులకు సహాయం

విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పెద్ద మనుసు చాటుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండకు మంగళవారం బయలుదేరిన ఆమె మార్గమధ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను దగ్గరుండి 108 లో హాస్పిటల్ కు తరలించారు. 108 సిబ్బందికి రోడ్డు ప్రమాదం జరిగిన స్థలానికి సంబంధించిన వివరాలను అందిస్తూ, వారిని గైడ్ చేశారు. క్షతగాత్రుల వివరాలు తెలుసుకొని, వారి కుటుంబాలకు సమాచారం అందించడంతో పాటు, చికిత్స ఏర్పాట్లను పరిశీలించాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాల్సిందిగా మంత్రి సురేఖ ప్రజలకు సూచించారు.

Exit mobile version