విధాత, ఖమ్మం : పాలేరులో నా గెలుపును ఆపడానికి మీ నాయన మూడు సార్లు ముక్కు నేలకు రాసిన.. ఆపలేకపోయాడు. నియోజకవర్గానికి వచ్చి ఏం చేయలేకపోయాడు. ఆయన వల్లే కాలేదు.. నీ వల్ల అవుద్దా.. నువ్వు ఒక బచ్చాగాడివి అంటూ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పై విరుచుకపడ్డారు. తన నియోకవర్గ పరిధిలోని ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెన ముందు అహంకారపూరిత మాటలకు ఇప్పటికే రెండుసార్లు బుద్ధి చెప్పారు. మూడవసారి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నా మీద నువ్వు నిలబడతావా? మళ్లీ నీ మీద బచ్చాగాన్ని పార్టీ నిలబెట్టి గెలిపిస్తుందా? చూడాలని అన్నారు.
మూడున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల వరకు అసలు నువ్వు ఇండియాలో ఉంటావా? సంచి సర్దుకుని విదేశాలకు చెక్కుతవా.. అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్ణయించడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మీ పార్టీ సత్తా చూపించండంటూ పొంగులేటి సవాల్ చేశారు.