Site icon vidhaatha

Rakhi Purnima | సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా

Rakhi Purnima | రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. మంత్రి సీతక్క సీఎం రేవంత్‌ రెడ్డి నివాసానికి వెళ్లి సీఎంకు రాఖీ కట్టారు. రేవంత్ రెడ్డి మనవడికి కూడా సీతక్క రాఖీ కట్టింది. అనంతరం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు.

ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, రాగమయి, కార్పొరేషన్ చైర్మన్లు బండ్రు శోభారాణి, నెరేళ్ల శారద, కాలువ సుజాత, తదితరులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. అనంతరం సీతక్క డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, అసెంబ్లీ ఆవరణలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు కూడా సీతక్క రాఖీ కట్టారు.

Exit mobile version