విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో యూరియా సరఫరాలో రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. మంగళవారం వ్యవసాయ అధికారులతో తుమ్మల సమీక్ష నిర్వహించారు. యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
నిన్న ఒక్కరోజే 9 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని..ఇవాళ మరో 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని వెల్లడించారు. మరో వారం రోజుల్లో 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కానుందని తెలిపారు. వరదలతో రాష్ట్రంలో దెబ్బతిన్న పంటలకు సంబంధించి 5 రోజుల్లో పంట నష్టంపై సర్వే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.