విధాత, హైదరాబాద్ : విద్యా రంగం సమస్యల పరిష్కారం కోరుతూ పీడీఎస్‌యూ, పీవైఎల్ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆయా సంఘాల కార్యకర్తలను, నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా తోపులాట సాగింది. పీడీఎస్‌య, పీవైఎల్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు విద్యారంగం సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరితే పోలీసులతో అణిచివేత చర్యలకు దిగడం శోచనీయమన్నారు. ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 30% నిధులు కేటాయించాని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని, జాబ్ క్యాలెండర్‌ను తక్షణమే రూపొందించి, ఉద్యోగాల ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
పీడీఎస్‌యూ..పీవైఎల్ అసెంబ్లీ ముట్టడి భగ్నం
విద్యా రంగం సమస్యల పరిష్కారం కోరుతూ పీడీఎస్‌యూ, పీవైఎల్ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు

Latest News
‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయంపై మెగాస్టార్ భావోద్వేగ స్పందన
చిలకపచ్చ చీరలో కేక పెట్టిస్తున్న మాళవిక మోహనన్
చీరకట్టులో హీట్ పెంచిన నిధి అగర్వాల్
ఢిల్లీ గెలుపు : ముంబైకి వరుసగా మూడో పరాజయం
ఇది బ్లాక్‌బస్టర్ కాదు… ‘బాస్‌బస్టర్’! – అల్లు అర్జున్
రూ.10 కోట్ల లాటరీ గెలిచిన డ్రైవర్ : రాత్రికిరాత్రే మారిపోయిన జీవితం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తోంది : ఈనెల 24న లేదా 27న
రాత్రి బెడ్‌లైట్ వేసుకొని పడుకుంటున్నారా..? గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 50 శాతం అధికమట జాగ్రత్త
చీరల కోసం ఉదయం 4 గంటల నుంచే షోరూమ్ ముందు బారులు తీరిన మహిళలు.. ఎందుకంత డిమాండ్..?
రియల్ మీ బాహుబలి బ్యాటరీ మొబైల్ లాంచ్ డేట్ ఫిక్స్ !