విధాత:ఐదు ఏళ్లపాటు ఎం ఎల్ ఏ,ఎం.పి లు గా కేవలం గౌరవ హోదాలో పని చేసిన ప్రజాప్రతినిధులకు వారి పదవీ విరమణ చేసిన 5 సం.తరువాత వారు చేసింది గౌరవ హోదా అయినప్పటికీ,ప్రజా సేవకోసం వచ్చినప్పటికీ వారి పదవి ముగిశాక జీవిత కాలం అనేకసౌకర్యలతో పాటు ,భారీ పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందేనని,అయితే వారికి ఈ సౌకర్యాలు కల్పించటం తమకు అభ్యంతరం లేదని,తాము కాంట్రాక్టు,లేదా ఔట్ సోర్సింగ్ పేరుతోనో,మరోపేరుతోనో ఏళ్ల తరబడి అనేక కష్ట నష్టములకు ఓర్చి నామమాత్రపు వేతనంతో, ఏవిధమైన అలవెన్సులు,ఇతర అదనపు సౌకర్యాలు లేకపోయినా గొడ్డు చాకిరీ చేసే తమకు ఉద్యోగ రక్షణ కల్పించక పోగా 10 ఏళ్ళు చేసిన వారిని నిర్దయగా మీకు ఏమీ అడిగే హక్కులు లేవని అర్ధాంతరంగా నిర్దయగా తొలగిస్తున్నారు.ఇలా తొలగించే కాంట్రాక్టు,లేదా ఔట్ సోర్సింగ్ ఇంకా ఏపేరుతో పిలిచినా ప్రభుత్వ రంగంలోని వివిధ శాఖల్లో కనీసం 5 ఏళ్ళు చేసిన వారికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని పలువురు ఈ ఏమాత్రం నికరంలేని ఉద్యోగంలో ఉన్నవారు,10 ఏళ్లపాటు గొడ్డు చాకిరీ చేసి అర్ధాంతరంగా నిర్దయగా తొలగించిన ఈ తరహా ఉద్యోగులు వారి బంధువులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
ప్రజా సేవకు వచ్చి కేవలం 5 ఏళ్ళు పనిచేసిన వారికీ భారీగా పెన్షన్,ఇతర సౌకర్యాలు కల్పించే ప్రభుత్వాలు,కరోనా మహమ్మారిలాంటి భయాంకర వ్యాధి ఇతర క్లిష్టమైన ఉద్యోగంలో ఏవిధమైన సౌకర్యాలు,అలవెన్సులు లేకుండా నామ మాత్రపు వేతనానికి, దాన్నికూడా ప్రతి రోజు ఎవరూ ఎప్పుడు తొలగిస్తారో,తమ స్థానాల్లోవారి మనుషులను ఏసుకుంటారో తెలియని ఆందోళన మరోవైపు నిత్యం ఒక గండంగా గడుపుతూ వయస్సుని ధారబోసి, వయసు ఉడిగాక ఇలా నిర్దయగా తొలగించడం దారుణం అని,ఇలా అన్యాయానికి గురైన వారికి పెన్షన్ కల్పించాలని వారు కోరుతున్నారు.