విధాత : పెట్టుబడుల సాధన లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం ఎన్నారైలు, విదేశీ కంపనీల ప్రతినిధులతో వరుస సమావేశాలకు బిజీగా ఉంది. సీఎంకు ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ స్ట్రీట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సంబంధిత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా న్యూయార్క్ టైమ్ స్క్వేర్ స్ట్రీట్ తరహాలోనే హైదరాబాద్‌లోనూ మల్టీపర్పస్ హబ్ నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే నిర్ణయించారు. హైదరాబాద్‌లో మరో ల్యాండ్ మార్క్‌గా రాయదుర్గంలో చేపట్టనున్న సదరు నిర్మాణం కోసం టీజీఐఐసీ టెండర్లు సైతం పిలిచింది.
Fans of Shri A. Revanth Reddy @revanth_anumula celebrated his successful first day in New York with meetings with several companies with several reels at Times Square. pic.twitter.com/veoarWZybU
— HEMA NIDADHANA (@Hema_Journo) August 6, 2024