China manja death| చైనా మాంజాకు మరొకరి బలి !

చైనా మాంజా మరో వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. సంగారెడ్డి జిల్లా పసల్వాడి గ్రామంలో చైనా మాంజా మెడకు చుట్టుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని యూపీకి చెందిన అవిదేశ్‌(35)గా గుర్తించారు.

విధాత : చైనా మాంజా మరో వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. సంగారెడ్డి జిల్లా పసల్వాడి గ్రామంలో చైనా మాంజా మెడకు చుట్టుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని యూపీకి చెందిన అవిదేశ్‌(35)గా గుర్తించారు.

అవిదేశ్ బైక్ పై వెళ్తుండగా ఫసల్వాది వద్ద చైనా మాంజా మెడకు చుట్టుకుంది. ప్రమాదంలో మంజా మెడను కోయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవలి కొన్ని రోజులలో చైనా మాంజాతో గాయాలపాలై పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చైనా మాంజా సమస్య తీవ్రతను చాటుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం, పోలీస్ శాఖ చైనా మాంజాపై నిషేధం విధించినప్పటికి, అక్కడక్కడా ఇంకా చైనా మాంజా అమ్మకాలు సాగుతుండటం ప్రాణ నష్టానికి దారితీస్తుంది. చైనా మాంజాతో కేవలం మనుషులే కాకుండా పక్షులు కూడా ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళనకరంగా మారింది.

Latest News