Prajavani | హైద‌రాబాదీలారా.. రేపు జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌జావాణి

Prajavani | చాలా ఏండ్ల త‌ర్వాత హైద‌రాబాదీల‌కు గొప్ప అవ‌కాశం ల‌భించింది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం ముంద‌డుగు వేసింది. హైద‌రాబాద్ వాసులు త‌మ స‌మ‌స్య‌ల‌ను నేరుగా ఉన్న‌తాధికారుల‌కు విన్న‌వించుకునేందుకు ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది.

  • Publish Date - June 23, 2024 / 08:13 AM IST

Prajavani | హైద‌రాబాద్ : చాలా ఏండ్ల త‌ర్వాత హైద‌రాబాదీల‌కు గొప్ప అవ‌కాశం ల‌భించింది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం ముంద‌డుగు వేసింది. హైద‌రాబాద్ వాసులు త‌మ స‌మ‌స్య‌ల‌ను నేరుగా ఉన్న‌తాధికారుల‌కు విన్న‌వించుకునేందుకు ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది.

ఈ నెల 24వ తేదీన‌(సోమ‌వారం) హైద‌రాబాద్ న‌గ‌రంలోని జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌జావాణి నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. సోమ‌వారం నాడు ఉద‌యం 10.30 నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కు ప్ర‌జావాణి నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్ర‌జావాణిలో భాగంగా హైద‌రాబాద్ వాసులు త‌మ స‌మ‌స్య‌ల‌ను అధికారుల దృష్టికి తీసుకురావొచ్చు. ప్ర‌జావాణికి హాజ‌రు కాలేని వారు నేరుగా జీహెచ్ఎంసీ అధికారుల‌తో ఫోన్ కాల్ మాట్లాడి తమ స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించేందుకు అవ‌కాశం క‌ల్పించారు. 040-23222182 నంబ‌ర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. జీహెచ్ఎంసీ జోన‌ల్, స‌ర్కిల్ కార్యాల‌యాల్లోనూ స‌మ‌స్య‌ల‌పై ఫిర్యాదు చేయొచ్చ‌ని అధికారులు తెలిపారు.

Latest News