Kokapet Lands | ఎకరం రూ.137 కోట్లు.. కోకాపేటలో రికార్డు ధర

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో కోకాపేట మరోసారి రికార్డు సృష్టించింది. తెలంగాణ సర్కార్ నిర్వహించిన భూముల ఈ-వేలంలో ప్లాట్లు అద్భుతమైన ధరలను నమోదు చేశాయి.

విధాత, హైదరాబాద్ :
హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో కోకాపేట మరోసారి రికార్డు సృష్టించింది. HMDA నిర్వహించిన భూముల ఈ-వేలంలో ప్లాట్లు అద్భుతమైన ధరలను నమోదు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ వేలంలో ఎకరం రూ.137 కోట్లు పలికింది. కాగా, ఇటీవల కాలంలో ఇంత భారీగా ధర పలకడం ఇదే తొలిసారి.  కోకాపేటలోని ప్లాట్ నెంబర్లు 17, 18కు భారీ స్పందన లభించింది. ఈ వేలంలో ప్లాట్‌ నెంబర్‌ 17, 18 స్థలాలకు పెట్టుబడిదారుల నుంచి పెద్ద ఎత్తున బిడ్డింగ్‌ వచ్చింది. ఈ వేలంలో ప్లాట్‌ నెంబర్‌ 17 – 4.59 ఎకరాలు, ప్లాట్‌ నెంబర్‌ 18 – 5.31 ఎకరాలు.. ఈ రెండు ప్లాట్లను కలిపి మొత్తం 9.9 ఎకరాలను వేలంలో నిలిపింది.

మొత్తం బిడ్ లో ఈ 9.9 ఎకరాలకు పెట్టుబడిదారులు రూ.1355.33 కోట్లు వెచ్చించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కోకాపేటకు ఉన్న భారీ డిమాండ్‌ను మరోసారి రుజువు అయింది. కోకాపేట నియో పోలిస్‌లో 41 ఎకరాల విస్తీర్ణంలోని ఆరు ప్లాట్లను వేలం వేసేందుకు హెచ్ఎండీఏ నిర్ణయించింది. గోల్డెన్ మైల్ లోని సైట్-2లో 1.98 ఎకరాలకు, మూసాపేట్ లో 11.48 ఎకరాలు, 318 ఎకరాల్లోని రెండు సైట్లను ఈ వేలం వేయనుంది. కాగా గోల్డెన్ మైల్ కు రూ.70 కోట్లు, మూసాపేట్ సైట్ కు రూ.75 కోట్ల చొప్పున ఆఫ్ సెట్ ధరను నిర్ణయించింది.

దీంతో సోమవారం నియోపోలిస్ వెంచర్ లోని 17, 18 ప్లాట్లను హెచ్ఎండీ ఈ-వేలం వేయగా ఎకరానికి రూ.137 కోట్ల రికార్డు ధర పలికింది. కాగా, నవంబర్ 28 తో పాటు డిసెంబర్ 3వ తేదీల్లో మిగతా భూములకు సంబంధించిన వేలం జరగనుంది. కాగా, కోకాపేట్ నియోపోలిస్ లే అవుట్ లో 2021 జూన్ లో మొదటి దశలో భాగంగా ప్రభుత్వం 64 ఎకరాలను విక్రయించింది. అప్పట్లోనే ఈ భూమలకు 2వేల కోట్ల రూపాయలకు పైగా వచ్చాయి. తరువాత 2023 ఆగస్టులో నిర్వహించిన రెండో దశలో విక్రయించిన 45.33 ఎకరాలకు రూ.3,300 కోట్ల వరకు లభించాయి.

తాజాగా, నిర్వహించిన బిడ్డింగ్ లో రికార్డు స్థాయిలో ధర పలికింది. హైదరాబాద్ నగరానికి పడమర వైపు ఆకాశ హర్మ్యాలతో కోకాపట్ అలరాడడంతో పాటు ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్డు, మరోవైపు రాయదుర్గం వైపు 5 కిలో మీటర్ల పరిధిలో టాప్ ఫార్చూన్ కంపెనీలకు చేరువలో ఉంది. సముద్ర మట్టానికి 588 ఎత్తులో ఉన్న కోకాపేట్ నియోపోలిస్ లో ఎన్ని అంతస్థుల వరకైనా నిర్మాణాలు చేసుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డుకు 2నిమిషాల్లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుకు 5 నిమిషాల్లో, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 20 నిమిషాల్లో ఇక్కడి నుంచి చేరుకోవచ్చు. హెచ్ఎండీఏ కూడా రూ.300 కోట్లతో 40 ఎకరాల్లో లేఅవుట్ వేసి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ఇవ్వన్ని కలిసి కోకాపేట్ లో భూములు కొనేందుకు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.

Latest News