తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక సమర్పించింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు 50 శాతం మించకుండా సిఫార్సు చేస్తూ నివేదిక అందించింది.

విధాత, హైదరాబాద్ :

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక సమర్పించింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు 50 శాతం మించకుండా సిఫార్సు చేస్తూ నివేదిక అందించింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం రిజర్వేషన్లు మించకుండా సిఫార్సు చేసింది. డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా.. తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది.

ఈ నెల 24న హైకోర్టు విచారణకు ముందే ప్రక్రియ పూర్తికి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. డిసెంబర్ 20లోపు 3 విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేందుకు ఈసీ సిద్ధమైంది.  12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 16వరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా ఈసీ ప్రణాళికలు రచిస్తోంది.

Latest News