SCR Special Trains | వేసవి రద్దీ.. మరో 15 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. ఫుల్‌ డిటేయిల్స్‌ ఇవే..!

SCR Special Trains | దక్షిణ మధ్య రైల్వేజోన్‌ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను తీసుకువచ్చినట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు వచ్చే నెల అంటే మే ఒకటో తేదీ నుంచి ఆగస్టు 2 వరకు ఆయా మార్గాల మధ్య రాకపోకలు సాగిస్తాయని చెప్పింది.

  • Publish Date - April 16, 2024 / 07:26 AM IST

SCR Special Trains | దక్షిణ మధ్య రైల్వేజోన్‌ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను తీసుకువచ్చినట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు వచ్చే నెల అంటే మే ఒకటో తేదీ నుంచి ఆగస్టు 2 వరకు ఆయా మార్గాల మధ్య రాకపోకలు సాగిస్తాయని చెప్పింది. పాట్నా-సికింద్రాబాద్‌ (03253) మధ్య మే ఒకటి నుంచి జూలై 31 వరకు ప్రతి సోమ, బుధవారాల్లో నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్‌ – పాట్నా (07255) రైలు మే 8 నుంచి జూలై 31 వరకు.. సికింద్రాబాద్‌-పాట్నా (07256) రైలు మే 3 నుంచి ఆగస్టు 2 వరకు ప్రతి సోమవారం నడువనున్నది. దానాపూర్‌-సికింద్రాబాద్‌ (03225) మే 5 నుంచి జూలై 25 వరకు ప్రతి గురువారం. సికింద్రాబాద్‌ – దానాపూర్‌ (03226) ప్రత్యేక రైలు మే 5 నుంచి జూలై 28 వరకు ప్రతి ఆదివారం ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని వివరించింది. అలాగే బెంగళూరు – దానాపూర్‌, దానాపూర్‌ – బెంగళూరు మధ్య మరో పది రైళ్లు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఆయా రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది.

 

Latest News