SI Venkateshwarlu | సూర్యాపేట : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. కోదాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మద్దతు తెలిపినా ఓటమి తప్పలేదు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో పంచాయతీ ఎన్నికల కోసం ఎస్ఐ వెంకటేశ్వర్లు తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనంతరం ఎన్నికల బరిలో దిగాడు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మద్దతుతో జోరుగా ప్రచారం చేశాడు. అయినా ఓటమి పాలయ్యాడు. ఆయనను గుడిబండ గ్రామస్తులు చిత్తుగా ఓడించారు. తాను పుట్టిన గ్రామానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయన కల నెరవేరలేదు. మరో ఐదు నెలల ఎస్ఐ పదవీకాల ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్న వెంకటేశ్వర్లుకు నిరాశే మిగిలింది.
