ప్రభుత్వం ఒత్తిడి, అధికారుల నిర్లక్ష్యంతోనే నిర్మాణంలో లోపాలు
కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ఈఎన్సీలు మురళీధర్, నరేందర్‌రెడ్డిలు
విధాత, హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల ఒత్తిడి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్‌ల ఫైనల్ అప్రూవల్‌లపై తాము సంతకం చేశామని మాజీ ఈఎన్సీ మురళీధర్, సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్‌రెడ్డిలు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ గరువారం వారిని ప్రశ్నించారు. డిజైన్ల అప్రూవల్స్‌పై మొదట తాను సంతకం చేయలేదని కేసీఆర్, హరీశ్ రావు, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల సంతకాలు చేసినట్లు నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రగా చేయాలన్న ఒత్తిడి వల్ల హడావుడిగా అన్నీ అప్రూవల్ చేశామన్నారు. మేడిగడ్డ ప్రతి డిజైన్‌లో సీడీవోతో పాటు టీ సంస్థ ఎల్‌ఆండ్‌టీ పాల్గొందని తెలిపారు.”ప్రాజెక్టు నిర్మాణ సంబంధ చర్చల్లో నేను పాల్గొనలేదని, ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడే తప్పిదాలు జరిగాయన్నారు. ప్రభుత్వం ఒత్తిడి, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని కుండబద్దలు కొట్టారు. పైనుంచి ఒత్తిడి వల్ల క్వాలిటీ కంట్రోల్ చెక్ సరిగా చేయలేదని, బ్యారేజీ నిర్వహణ, గేట్ల ఆపరేషన్ సరిగా చేయలేదని నరేందర్ రెడ్డి కీలక అంశాలు వెల్లడించారు. ప్రాజెక్టను ఎల్‌ఆండ్‌టీ లేక మీరు డిజైన్ చేశారా? అడిగిన ప్రశ్నకు సెంట్రల్ డిజైన్ రూపొందించిందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగిన ప్రాంతానికి తాను వెళ్లలేదని..నిర్మాణం అసలు తన పరిధిలోనిది కాదని స్పష్టం చేశారు.