విధాత : మావోయిస్టు పార్టీ నుంచి వరుస లొంగుబాటులు కొనసాగుతున్నాయి. గురువారం సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శిగా కొనసాగిన బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ తెలంగాణ పోలీసుల ఎదుట నిరాయిదుడిగా లొంగిపోయారు. తీవ్రమైన అనారోగ్యంతో లొంగిపోయినట్లుగా సమాచారం. మావోయిస్టు అనుబంధ సంస్థగా ముద్ర పడి..అర్బన్ నక్సల్స్ గా పిలవబడుతున్న సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) ఇటీవల ఆయుధాలు వీడాలన్న మల్లోజుల వేణుగోపాల్ వాదనను సమర్ధించిన సంగతి తెలిసిందే. అశోక్ పేరిట విడుదల చేసిన లేఖలో తొలుత మల్లోజుల వాదనను బలపరుచగా..తర్వాతా విడుదలైన మరో లేఖలో మల్లోజుల వాదనను తప్పుబట్టారు. అందులో ఏదీ అసలు లేఖ అన్నది గందరగోళాన్ని రేపింది.
మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ముందు మల్లోజుల లొంగుబాటుకు ముందు ఆయన ఇచ్చిన ఆయుధాలు వీడుదాం అనే పిలుపుకు మూడు కమిటీలు ఆమోదం తెలపగా.. హిడ్మా, తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ నేతృత్వం వహించే కమిటీలు వ్యతిరేకించడం గమనార్హం.