సీతారామ లింక్ కాలువతో పాలేరు సస్యశ్యామం … పనుల పరిశీలనలో మంత్రి పొంగులేటి

సీతారామ ప్రాజెక్టు నుంచి 100కోట్లతో నిర్మితమవుతున్న పాలేరు లింక్ కెనాల్ నిర్మాణంతో టెయిల్ ఎండ్‌లోని పాలేరు నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు

  • Publish Date - July 2, 2024 / 02:19 PM IST

విధాత : సీతారామ ప్రాజెక్టు నుంచి 100కోట్లతో నిర్మితమవుతున్న పాలేరు లింక్ కెనాల్ నిర్మాణంతో టెయిల్ ఎండ్‌లోని పాలేరు నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తోడేళ్లగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ పాలేరు లింకు కాలువను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా 2,800కోట్లతో 2లక్షళ 50వల ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో చేపట్టిన ఇందిరా సాగర్‌, రాజీవ్ సాగర్‌లను రీడిజైన్ చేసి, సీతారామ ప్రాజెక్టుగా పేరుమార్చిన మాజీ సీఎం కేసీఆర్ ప్రాజెక్టు వ్యయాన్ని తొలుత 9వేల కోట్లకు, తదుపరి 18వేలకోట్లకు పెంచారని విమర్శించారు. ఇంత చేసినా అదనంగా ఒక్క ఎకరాకు నీరివ్వకపోవడం హాస్యాస్పదమన్నారు. పేదోడిఇందిరమ్మ ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలో అధికారంలోకి వచ్చాకా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించి సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామన్నారు. హెడ్ వర్క్స్‌, లిఫ్టుల పనులను సమీక్షించగా, ఇప్పటికే మొదటి లిఫ్టు ట్రయల్ రన్ పూర్తి చేశామన్నారు. సీతారామ ప్రాజెక్టులో టెయిల్ ఎండ్‌లో ఉన్న పాలేరు నీళ్లందించేందుకు చేపట్టిన లింక్ కెనాల్ నిర్మాణంలో మధ్యలో కొన్నిచోట్ల పనులకు టెండర్లు కూడా పిలువలేదన్నారు. వాటికి ఆగస్టు 15లోగా టెండర్లు పిలిచి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. పాలేరు ప్రాంతంలోని సాగర్ కాలువ పరిధిలోని లక్ష యభై వేల ఎకరాలను, మీడియం ఇరిగేషన్‌లోని వైరా, లంకాసాగర్ ఆయకట్టుతో పాటు మైనర్ ఇరిగేషన్ ఆయట్టుకు స్ధిరీకరణకు ఏనుకూరు దగ్గర లింకు కెనాల్‌ను సాగర్ కాలువ వరకు సీతారామ ప్రాజెక్టు నుంచి నిర్మించడం జరుగుతుందన్నారు. వంద కోట్లతో నిర్మిస్తున్న ఈ లింక్ కెనాల్‌లో 15,16ప్యాకేజీలో మున్నేరు, ఆకేరు నదులపై అక్విడెక్ట్‌(వాగుల మీదుగా నీళ్లు ప్రవహించే కట్టడం)ల నిర్మాణాలు, 55వంతెనలు, కల్వర్టులతో పాటు మరో 25చిన్న వంతెనలు, కల్వర్టుల నిర్మాణం పూర్తి కావచ్చాయన్నారు.
అనంతరం మంత్రి పొంగులేటి పాలేరు లింక్ కెనాల్ పనుల పరిశీలనలో భాగంగా తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెఎం ఆకేరుపై నిర్మిస్తున్న అక్విడెక్ట్‌ను, ద్మాయిగూడెం, బీరోలు, కూసుమంచి మండలం పోచారం వ్ద సొరంగం త్రవ్వకం పనులను పరిశీలించారు. మధ్యాహ్నం కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Latest News