విధాత, హైదరాబాద్ : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఎంపికలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అనవసరమంటూ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ మండిపడ్డారు. దివ్యాంగులపై ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ వీడియో ద్వారా తెలిపారు. వైకల్యం పేరుతో వారి హక్కులను హరించడం సరైంది కాదన్నారు. ‘దివ్యాంగులు కొన్ని ఉద్యోగాలకు పనికిరారని స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. వాళ్లు సకాలంగుల కంటే ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించారని గుర్తు చేశారు. చట్టాలను అమలు చేయాల్సిన ఏఐఎస్ అధికారిణి వైకల్యాన్ని కించపర్చడం సమంజసం కాదన్నారు. స్మితా సబర్వాల్.. తను చేసిన వ్యాఖ్యలను వెనక్కితీసుకోకపోగా.. సమర్ధించుకోవడం శోచనీయమని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోదండరాం సూచించారు.
Professor Kodandaram | స్మితా సభర్వాల్ వ్యాఖ్యలు ఖండనీయం : ప్రొఫెసర్ కోదండరామ్
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఎంపికలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అనవసరమంటూ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ మండిపడ్డారు.

Latest News
బిగ్ బాస్‌లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్..
ప్రొఫెసర్ లైంగికదాడి.. గర్భం దాల్చిన బీఈడీ విద్యార్థిని
చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!
ఇంటర్నేషనల్ స్టేజ్‌లో మెరుపు మెరిపించిన నటి ప్రగతి
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది సజీవదహనం
ఐదేళ్ల బాలుడిని చంపిన చిరుత
ఈ వారం రాశిఫలాలు.. ప్రభుత్వ ఉద్యోగం కోసం యత్నిస్తున్న ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం