Special Rains | ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 36 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..!

Special Rains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల్లో నడుపుతున్న ప్రత్యేక రైళ్లను సెప్టెంబర్‌, అక్టోబర్‌ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న రద్దీకి అనుగుణంగా ఆయా స్పెషల్‌ ట్రైన్స్‌ను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

  • Publish Date - June 30, 2024 / 08:52 AM IST

Special Rains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల్లో నడుపుతున్న ప్రత్యేక రైళ్లను సెప్టెంబర్‌, అక్టోబర్‌ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న రద్దీకి అనుగుణంగా ఆయా స్పెషల్‌ ట్రైన్స్‌ను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్‌ – అగర్తలా (07030), అగర్తలా – సికింద్రాబాద్‌ (07031), హైదరాబాద్‌ – జైపూర్‌ (07115), జైపూర్‌ – హైదరాబాద్‌ (07116), కాచిగూడ – లాల్‌గఢ్‌ (07053), లాల్‌గఢ్‌ – కాచిగూడ (07054), హైదరాబాద్‌ – గోరక్‌పూర్‌ (02575), గోరక్‌పూర్‌ – హైదరాబాద్‌ (02576), సికింద్రాబాద్‌ – రామనాథపురం (07695), రామనాథపురం – సికింద్రాబాద్‌ (07696) మధ్య ప్రత్యేక రైళ్లను పొడిగించింది.

కాచిగూడ – మధురై (07191), మధురై – కాచిగూడ (07192), నాందేడ్‌ – ఈరోడ్‌ (07189), ఈరోడ్‌ – నాందేడ్‌ (07190), కాచిగూడ – నాగర్‌కోయిల్‌ (07435), నాగర్‌ కోయిల్‌ – కాచిగూడ (07436), హైదరాబాద్‌ – రక్సల్‌ (07051), రక్సల్‌ – హైదరాబాద్‌ (07052), సికింద్రాబాద్‌ – రక్సల్‌ (07005), రక్సల్‌ – సికింద్రాబాద్‌ (07006), సికింద్రాబాద్‌ – దానాపూర్‌ (07647), దానాపూర్‌ – సికింద్రాబాద్‌ (07648) మధ్య ప్రత్యేక సర్వీసులు పొడిగించినట్లు పేర్కొంది. వీటితో పాటు నిజాముద్దీన్‌, సంత్రగాచి, తిరుపతి, సోలాపూర్‌ మార్గాల్లో ఆయా రైళ్లను పొడిగిస్తున్నట్లు వివరించింది. ఆయా రైళ్లను ప్రయాణికులు సద్విని యోగం చేసుకోవాలని కోరింది.

Latest News