Site icon vidhaatha

SCR Special Trains | ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఏడు ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్‌-తిరుపతి (07489) ఈ నెల 11న, తిరుపతి-సికింద్రాబాద్‌ (07490) 13న ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు తెలిపింది. ఈ నెల 10న మచిలీపట్నం-సికింద్రాబాద్‌ (07009), ఈ నెల 11న సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌ (07250) మధ్య రైలును నడిపించనున్నట్లు పేర్కొంది. 13న కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌ మధ్య రైలు నడువనున్నట్లు చెప్పింది. 06న యశ్వంతపూర్‌-బీదర్‌ (06227) మధ్య ప్రత్యేక రైలు, 7న బీదర్‌ – యశ్వంత్‌పూర్ (06228) మధ్య నడుస్తుందని తెలిపింది.

Exit mobile version