అభివృద్ధి పనులు వేగవంతం చేయండి అధికారులకు … మంత్రి ఉత్తమ్ ఆదేశం

ఇప్పటికే మంజూరైన పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

  • Publish Date - June 23, 2024 / 08:03 PM IST

విధాత: ఇప్పటికే మంజూరైన పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్లో క్యాంపు కార్యాలయంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి తో కలిసి ఆయన హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు ఈనెల 19న శంకుస్థాపన చేసిన ఆర్ అండ్ బి పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయించాలని సూచించారు.

అనంతగిరి నుంచి చనుపల్లికి డబుల్ రోడ్డు (రూ. 20 కోట్లు), బరఖత్‌గూడెం నుంచి కేఆర్సీ పురం వరకు డబుల్ రోడ్డు(రూ.20కోట్లు),ఎన్ హెచ్ 9 నుంచి మోతె వరకు డబుల్ రోడ్డు (రూ. 25 కోట్లు),
మల్లారెడ్డిగూడెం నుంచి రేవూరు మీదుగా రామాపురం వరకు డబుల్ రోడ్డు (రూ. 20 కోట్లు), అమరవరం నుంచి అలింగాపురం వరకు డబుల్ రోడ్డు (రూ. 23 కోట్లు), నేరేడుచెర్ల నుంచి దూపాడు వరకు డబుల్ రోడ్డు (రూ. 26 కోట్లు) పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. అలాగే కొత్తగా ఏర్పడిన అనంతగిరి, పాలకీడు, చింతలపాలెం మండలాల్లో మంజూరు చేయించిన తహశీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్ల కార్యాలయ భవనాల నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.ఆర్‌అండ్‌బీ సీఈలు మోహన్‌నాయక్‌, రాజేశ్వర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Latest News