TG Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక మిగిలింది పదో తరగతి ఫలితాలే( Tenth Results ). ఈ ఫలితాల కోసం విద్యార్థులు( Students ) ఎదురు చూస్తున్నారు. ఈ నెలఖారులోగా పదో తరగతి ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఫలితాలకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయినందున.. ఫలితాల విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రభుత్వానికి దస్త్రం పంపింది. దాన్ని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించినట్లు సమాచారం. సీఎం ఆమోదం తెలిపితే.. ఈ నెలఖారులోగా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 2వ తేదీన పది పరీక్షలు ముగియగా, 15వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. దాదాపు 5 లక్షల మంది పది పరీక్షలకు హాజరయ్యారు.
ఇక ఈ ఏడాది ‘జీపీఏ’ విధానంలో కాకుండా మార్కుల జాబితా ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత కొన్నేండ్ల నుంచి పది ఫలితాల్లో జీపీఏ విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కాకుండా.. ఈ సారి మార్కులే ఇవ్వాలని ఖరారు చేసినట్లు సమాచారం.