Site icon vidhaatha

హైదరాబాద్ బిర్యానీ పేరు చెడగొడితే కఠిన చర్యలు … మంత్రి దామోదరం రాజనరసింహ హెచ్చరిక

విధాత : హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని, ఆహార కల్తీకి పాల్పడి పేరు చెడగొడితే కఠిన చర్యలుంటాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ హెచ్చరించారు. మంగళవారం నగరంలోని హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, బేకరీల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతున్నామని తెలిపారు. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. తప్పకుండా నాణ్యత చర్యలు పాటించి తీరాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్ తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు వర్క్‌షాపులు, అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఇటీవల హోటళ్లు, రెస్టారెంట్ల తనిఖీల్లో ఆహార కల్తీ, నాసిరకం పదార్ధాలు వెలుగు చూసిన వైనంతో మంత్రి రాజనరసింహ చేసిన హెచ్చరికల పట్ల నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version