Anti Corruption Bureau | విధాత, హైదరాబాద్ : అవినీతి అధికారుల ఆటకట్టించడంతో తెలంగాణలో ఏసీబీ దూకుడు కొనసాగుతుంది. కేవలం 8 నెలల్లోనే 179 కేసులు నమోదు చేసింది. ఏసీబీకి చిక్కిన 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసింది. మొత్తం రూ .44,30,35,724 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. ఆగస్టులో 31 కేసులను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. 22 మంది ప్రభుత్వ, నలుగురు ప్రైవేట్ ఉద్యోగులు అరెస్టు అయ్యారు. అవినీతి అధికారుల సమాచారాన్ని ప్రజలు 1064 నంబర్ కు కాల్ చేసి, లేదా 9440446106 నంబర్ కు వాట్సాప్ ద్వారా, ఏసీబీ ట్విటర్ ద్వారా అందించవచ్చని ఏసీబీ పేర్కొంది.
Anti Corruption Bureau : తెలంగాణలో ఏసీబీ దూకుడు
తెలంగాణలో ఏసీబీ దూకుడు: 8 నెలల్లో 179 కేసులు, 167 ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్, రూ.44.3 కోట్ల ఆస్తులు సీజ్.
