విధాత, ప్రత్యేక ప్రతినిధి: మేడారం జాతర అంటేనే దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తున్న వనదేవతల జాతరలో హిజ్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు..
సమ్మక్క సారలమ్మ జాతర మొదలవగానే హిజ్రాలు వారి కుటుంబ సమేతంగా మేడారం చేరుకొని వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ సమ్మక్క తల్లిని ఆవాహన చేసుకుని కుటుంబ సభ్యులతో డప్పు చప్పుళ్ళు నడుమ మట్టితో అమ్మవార్ల గద్దెలను ఏర్పాటు చేసి బంగారం (బెల్లం), మద్యం సమర్పించి కోళ్ళను,మేకలను బలి ఇస్తు అమ్మవార్లను పూజిస్తారనీ హిజ్రాలు తెలిపారు.
చిలకల గుట్ట నుండి సమ్మక్క రాక సందర్భంగా దారి వెంట రంగు రంగుల ముగ్గులు (పట్నాలు) వేసి అమ్మవార్లకు స్వాగతం పలుకుతారు. సమ్మక్క తల్లి గద్దెలకు చేరుకున్న తర్వాత ఓడి బియ్యం,బంగారం (బెల్లం) , కొబ్బరి కాయలు సమర్పింస్తారని ,ఇలా మేడారం జాతరలో వనదేవతలకు పూజలు నిర్వహించడం వల్ల తాము కోరిన కోర్కెలు తీరుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు.
ఇవి కూడా చదవండి :
Niagara Falls | వింటర్ వండర్ ల్యాండ్.. గడ్డకట్టిన నయాగరా అందాలు.. వీడియో చూశారా..?
Journalist Pension | జర్నలిస్టులకు శుభవార్త.. పెన్షన్ రూ. 13 వేలకు పెంపు
