Telangana Bandh : బీసీ రిజర్వేషన్ల సాధనకు 14న బీసీ సంఘాల రాష్ట్ర బంద్

బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను నిరసిస్తూ బీసీ సంఘాలు ఐక్యంగా ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎంపీ ఆర్.కృష్ణయ్య ఈ మేరకు ప్రకటన చేశారు.

Telangana Bandh On 14th October

విధాత, హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఐక్యంగా ఈ నెల 14న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్ర బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలూ మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన, పార్టీలపైన ఒత్తిడి తెచ్చేందుకు మిలియన్ మార్చ్ తరహాలో ఐక్య పోరాటాలు చేపట్టి, బీసీల సత్తా చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన 22 బీసీ సంఘాల సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌త, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కలిసి ఆర్.కృష్ణయ్య మాట్లాడారు.

నిరసనల్లో భాగంగా 13న జాతీయ రహదారుల దిగ్బంధం కూడా ఉంటుందని వారు తెలిపారు. ఈ ఉద్యమం శాంతియుతంగా, దృఢంగా జరుగుతుందని తెలిపారు. బీసీలు రాజ్యాధికారంలో వాటాదారులని, రాజ్యాధికారంతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. రాష్ట్ర బంద్ ను బీసీలు అంతా రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేయాలని కోరారు.