Site icon vidhaatha

Local Body Elections | స్థానిక సంస్థలు అత్యధికంగా ఏ జిల్లాలో ఉన్నాయో తెలుసా?

Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వార్డులు, పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ స్థానాలను ఖరారు చేసింది. అయితే గతంలో ఉన్న పలు పంచయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో స్థానిక సంస్థల సంఖ్య తగ్గింది. 2019లో పూర్తి జడ్పీటీసీల సంఖ్య 570, ఎంపీపీల సంఖ్య 570, ఎంపీటీసీల సంఖ్య 5,817, గ్రామ పంచాయతీల సంఖ్య 12,848, వార్డుల సంఖ్య 1,13,354 ఉండగా ప్రస్తుతం జడ్పీటీసీల సంఖ్య 566, ఎంపీపీలు 566, ఎంపీటీసీలు 5,773, గ్రామపంచాయతీలు 12,778, వార్డులు 1,12,694కు చేరింది. 4 జడ్పీటీసీలు, 4 ఎంపీపీలు, 70 పంచాయతీలు, 44 ఎంపీటీసీలు, 660 వార్డులు తగ్గాయి. అయితే జిల్లాల వారీగా అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఎంపీటీసీల సంఖ్య 353, ఎంపీపీలు 33, జడ్పీటీసీలు 33 ఉండగా అత్యల్పంగా ములుగు జిల్లాలో ఎంపీటీసీలు 83, జడ్పీటీసీలు 10, ఎంపీపీలు10 ఉన్నాయి.

ఆదిలాబాద్ జడ్పీటీసీలు20, ఎంపీపీలు 20, ఎంపీటీసీలు 166, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీటీసీలు 22, ఎంపీపీ 20, ఎంపీటీసీ 166, హనుమకొండ జడ్పీపీటీసీ 12, ఎంపీపీ 12, ఎంపీటీసీ 233, జగిత్యాల జడ్పీటీసీ 20, ఎంపీపీ 20, ఎంపీటీసీ216, జనగామ జడ్పీటీసీ 12, ఎంపీపీ 12, ఎంపీటీసీ 134, జయశంకర్ భూపాలపల్లి జడ్పీటీసీ 12, ఎంపీపీ 12, ఎంపీటీసీ 109, జోగులాంబ గద్వాల జడ్పీటీసీ 13, ఎంపీపీ 13, ఎంపీటీసీ 142, కామారెడ్డి జడ్పీటీసీ 25, ఎంపీపీ 25, ఎంపీటీసీ 233, కరీంనగర్ జడ్పీటీసీ 15, ఎంపీపీ 15, ఎంపీటీసీ 170, ఖమ్మం జడ్పీటీసీ 20, ఎంపీపీ 20, ఎంపీటీసీ 283, కుమురంభీం ఆసిఫాబాద్ జడ్పీటీసీ 15, ఎంపీపీ 15, ఎంపీటీసీ 127, మహబూబాబాద్ జడ్పీటీసీ 18, ఎంపీపీ 18, ఎంపీటీసీ 193, మహబూబ్ నగర్ జడ్పీటీసీ 16, ఎంపీపీ 16, ఎంపీటీసీ 175, మంచిర్యాల జడ్పీటీసీ 16, ఎంపీపీ 16, ఎంపీటీసీ 129, మెదక్ జడ్పీటీసీ 21, ఎంపీపీ 21, ఎంపీటీసీ 190, నాగర్ కర్నూల్ జడ్పీటీసీ 20, ఎంపీపీ 20, ఎంపీటీసీ 214, నారాయణపేట జడ్పీటీసీ 13, ఎంపీపీ 13, ఎంపీటీసీ 136, నిర్మల్ జడ్పీటీసీ 18, ఎంపీపీ 18, ఎంపీటీసీ 157, నిజామాబాద్ జడ్పీటీసీ 31, ఎంపీపీ 31, ఎంపీటీసీ 307, పెద్దపల్లి జడ్పీటీసీ 13, ఎంపీపీ 13, ఎంపీటీసీ 137, రాజన్న సిరిసిల్ల జడ్పీటీసీ 12, ఎంపీపీ 12, ఎంపీటీసీ 123, రంగారెడ్డి జడ్పీటీసీ 21, ఎంపీపీ 21, ఎంపీటీసీ 230, సంగారెడ్డి జడ్పీటీసీ 26, ఎంపీపీ 26, ఎంపీటీసీ 271, సిద్దిపేట జడ్పీటీసీ 26, ఎంపీపీ 26, ఎంపీటీసీ 230, సూర్యాపేట జడ్పీటీసీ 23, ఎంపీపీ 23, ఎంపీటీసీ 235, వికారాబాద్ జడ్పీటీసీ 20, ఎంపీపీ 20, ఎంపీటీసీ 227, వనపర్తి జడ్పీటీసీ 15, ఎంపీపీ 15, ఎంపీటీసీ 133, వరంగల్ జడ్పీటీసీ 11, ఎంపీపీ 11, ఎంపీటీసీ 130, యాదాద్రి భువనగిరి జడ్పీటీసీ 17, ఎంపీపీ 17, ఎంపీటీసీ 178.

ఇదిలా ఉంటే మరోవైపు క్షేత్రస్థాయిలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వార్డు నుంచి జడ్పీ ఛైర్మన్ వరకు రాబోయే రిజర్వేషన్ల వ్యవహారంపైనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి. గ్రామాలు, మండలాల పరిధిలో రిజర్వేషన్లు ఎలా వస్తాయనే అంశంపై అన్ని పార్టీల నాయకులు ఆరా తీస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించనుండడంతోనే ఈ రీతిలో గ్రామీణ స్థాయిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయనే అభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version