Site icon vidhaatha

Telangana : ఇదేమీ పని సారు..తాగొచ్చి తరగతి గదిలోనే నిద్రలోకి.!

telangana-government-school-teacher-drunk-in-classroom-in-asifabad-suspended

విధాత : పిల్లలకు..సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయుడే తన అనుచిత ప్రవర్తనతో అభాసు పాలయ్యాడు. పాఠాలు చెప్పాల్సిన పంతులు ఫుల్లుగా మద్యం సేవించి పాఠశాలకు రావడంతో పాటు తరగతి గదిలోనే నిద్రపోయిన నిర్వాకం వైరల్ గా మారింది. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్(Asifabad) జిల్లా జైనూర్ మండలం(Jainoor mandal) సుకుద్ పల్లి(Sukutupalli ) ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ పాఠశాలలో ఎస్ జీటీగా పనిచేస్తున్న విలాస్( J Vilas) మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. తరగతి గదిలో పిల్లలకు పాఠాలు బోధించడం మాని మద్యం మత్తులో తన కుర్చీకి టేబుల్ కు మధ్యలో నేలపైన నిద్రలోకి జారుకున్నాడు.

తమ సార్ పరిస్థితి చూసి తమకు పాఠాలు బోధించే వారు లేక అయోయమయంలో పిల్లలు తమ ముచ్చట్లు, ఆటల్లో మునిగిపోయారు. ఈ వ్యవహారం గమనించిన స్థానికులు ఉపాధ్యాయుడి నిర్వాకంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారులు విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడు విలాస్ ను సస్పెండ్ చేశారు.

Exit mobile version