విధాత, హైదరాబాద్ : హుజురాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీస్ కేసు నమోదైన క్రమంలో అసిఫాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై కూడా పోలీసు కేసులు నమోదవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. కుమ్రంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, బీఆరెస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఇరువర్గాల ధర్నాలు, రాస్తారోకోలు చేశాయి. ఈ వివాదంలో విశ్వప్రసాద్ రావు చేసిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై పోలీసులు 296(బీ), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆరెస్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం ఏకపక్షంగా కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు.నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని కేటీఆర్ తెలిపారు.
అసిఫాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై కేసు నమోదు .. ఖండించిన కేటీఆర్
హుజురాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీస్ కేసు నమోదైన క్రమంలో అసిఫాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై కూడా పోలీసు కేసులు నమోదవ్వడం హాట్ టాపిక్‌గా మారింది

Latest News
నా పెళ్లి రద్దు..ప్రకటించిన స్మృతి మంధాన
ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్
‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ రిలీజ్
మాజీ ఐఏఎస్ కు ఐదేళ్లు జైలు శిక్ష
సినిమా అనకొండ కాదు..నిజం పామునే!
ప్రగతి అక్కా...పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ఘాటు లేఖ
పోయినసారి నన్ను గెలిపించారు.. ఈ సారి నా భార్యను గెలిపించండి
ఇండిగో నిర్వాకం..ఆరో రోజు విమానాల రద్దు
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ