Urban Farming | మిద్దెపై కూరగాయల సాగుకు ట్రైనింగ్

పట్టణాల్లో ఉండేవారికి తమ ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు పండించేందుకు అర్బన్ ఫామింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉన్న కాస్త స్థలం అయిన వరండా మిద్దెలపై కూరగాయలు సాగు చేసుకోవచ్చు.

విధాత, హైదరాబాద్‌ :

పట్టణాల్లో ఉండేవారికి తమ ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు పండించేందుకు అర్బన్ ఫామింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉన్న కాస్త స్థలం అయిన వరండా మిద్దెలపై కూరగాయలు సాగు చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇండ్ల మిద్దెలపై కూరగాయలు సాగు చేసుకోవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలంగాణ ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అర్బన్‌ ఫామింగ్‌ పథకం కింద నగరాల్లో ఇంటి పరిసరాల్లోనే కూరగాయాల సాగు పద్ధతులను ప్రజలకు చేరువచేసేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ నెల 23న హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలలో జరిగే ఈ శిక్షణలో ఇంటి పైకప్పులు, బాల్కనీలు, ఆవరణల్లో కూరగాయలను సులభంగా సాగు చేసే విధానాలు, అవసరమైన పెరటి మట్టిమిశ్రమం, ఎరువులు, నీటి నిర్వహణ, కుండీల ఎంపిక తదితర అంశాలపై నిపుణులు మార్గనిర్దేశం చేయనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ శిక్షణకు ఆసక్తి గలవారు రూ.100 ఫీజు చెల్లించి నేరుగా హాజరు కావచ్చని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం హైద‌రాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్‌లో ఉన్న అర్బన్‌ ఫామింగ్‌ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. ఫోన్‌ నంబర్లు 8977714411 / 8688848714 ద్వారా కూడా సమాచారం అందుబాటులో ఉంటుందని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Latest News