హైదరాబాద్, మే 7 (విధాత) తెలంగాణ అంబేద్కర్ సచివాలయంలోని ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయం, వ్యక్తిగత ఉన్నతాధికారుల ఛాంబర్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జీ.చంద్రశేఖర్ రెడ్డి ఇటీవలే రాష్ట్ర సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ప్రధాన కమిషనర్ గా నియమితులయ్యారు. దీంతో ఆయన ఛాంబర్ ఖాళీ అయ్యింది. ఈ ఛాంబర్ కోసం ఇద్దరు ఐఏఎస్ అధికారులు లడాయికి దిగినట్లు సచివాలయంలో గుప్పు మంటున్నది.
సచివాలయం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇటీవలే ముఖ్య కార్యదర్శిగా నియమితులైన కేఎస్.శ్రీనివాస రాజు, చంద్రశేఖర్ రెడ్డి ఛాంబర్ ను పరిశీలించారు. వాస్తు పరంగా నచ్చడంతో తనకుదే ఛాంబర్ ను పరిశీలించారు. అయితే శ్రీనివాస రాజు చూశారని, వేచి ఉండమని పై అధికారులు తెలిపారు. ఇవేమీ పట్టించుకోకుండా మాణిక్కరాజ్ చంద్రశేఖర్ కేటాయించాలని జీఏడీ అధికారులకు ఆయన సమాచారమిచ్చారు. ఆ తరువాత ముఖ్యమంత్రి మరో కార్యదర్శి మాణిక్కరాజ్ కూడా అ రెడ్డి ఛాంబర్ ను స్వాధీనం చేసుకోవడమే కాకుండా, ఆయన పేషీని కూడా ఖాళీ చేయించాడు. ఈ ఘటనతో ముఖ్యమంత్రి కార్యాలయంలోని సిబ్బంది, అధికారులు అవాక్కయ్యారు. వాస్తవానికి సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) ఛాంబర్లను కేటాయిస్తుంది. ఈ విషయం ఆ నోట ఈ నోట సచివాలయం మొత్తం తెలిసిపోయింది.