విధాత : చోరీ కాబడిన ఫోన్ల ఆచూకీ గుర్తించి రికవరీ చేయడంలో తెలంగాణ పోలీస్ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. సంవత్సర కాలంలో రికార్డు స్థాయిలో 30వేల ఫోన్లను రికవరీ చేసి, దేశంలో ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్ రెండో స్థానంలో నిలిచినట్లుగా ఏడీజీ మహేశ్ భగవత్ వెల్లడించారు. సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే ఫోన్లో ట్రాకింగ్ సులభమవుతుందని మహేష్ భగవత్ తెలిపారు. ప్రజలు ఈ విషయమై చైతన్యవంతంగా వ్యవహారించాలని కోరారు.
Telangana Police | చోరీ ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్ భేష్.. 30వేల ఫోన్ల రికవరీ
