TG | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ : రాష్ట్రాల సీఎంలకు ప్రత్యేక ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ (Telangana Rising Global Summit-2025) సమ్మిట్ నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సబ్మిట్ కు అన్ని రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విధాత, హైదరాబాద్ :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ (Telangana Rising Global Summit-2025) సమ్మిట్ నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సబ్మిట్ కు అన్ని రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. స్వయంగా తెలంగాణ మంత్రులు వెళ్లి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా కలిసి గ్లోబల్ సమ్మిట్ ‌కు ఆహ్వానిస్తారు. ఈ నెల 4 వ తేదీన మంత్రులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన లేఖలు అందిస్తారు. ఎవరెవరు ఏ ఏ రాష్ట్రాలకు వెళ్లాలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రత్యేక వేదికను ఫ్యూచర్ సిటీలో రూపొందిస్తున్నారు. సమ్మిట్ లో కీలక ఒప్పందాలు చేసుకోవాడానికి రాష్ట్రప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు ఆహ్వానించింది. ఈ సదస్సుకు హాజరు కావాల్సిందిగా మూడు వేల మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపించింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి ఆహ్వానించనున్నారు.

అలాగే, రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించే మంత్రుల వివరాలు..

Latest News