101 Special Dishes To Son-In-Law | కొత్త అల్లుడికి 101 రకాల వంటకాల టాస్క్.. తులం బంగారం గెలుపు

కొత్త అల్లుడు 101 వంటకాల టాస్క్‌లో గెలిచి తులం బంగారం సాధించాడు. తెలంగాణ వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటన వీడియో వైరల్‌గా మారింది.

telangana-son-in-law-honored-with-101-dishes-and-gifted-gold-coin

విధాత : కొత్త అల్లుడుకు అత్తింటివారు పెట్టిన 101రకాల వంటకాల టాస్క్ లో విజేతగా నిలిచిన కొత్త అల్లుడు ఏకంగా తులం బంగారం గెలుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన సింధుకు, వరంగల్ కు చెందిన నికిత్‌తో 2 నెలల క్రితం వివాహం అయ్యింది. నికిత్ తన భార్యతో కలిసి దసరా పండుగకు కొత్తకోటలోని అత్తామామలు గుంత సురేష్, సహనల ఇంటికి వచ్చారు. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి దసరా పండుగకి వచ్చిన అల్లుడికి అత్తమామలు స్వీట్లు, పిండి వంటలు సహా 101 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా 101 రకాల వంటకాలలో ఒక వంటకం తగ్గిందని నిరూపిస్తే ఏమిస్తారని నికిత్ తన అత్తమామాలను సరదాగా అడిగాడు. ఒక్క వంటకం తగ్గినట్లు చూపిస్తే ఒక తులం బంగారం ఇస్తామని వారు అల్లుడి పందెంకు సిద్దమయ్యారు. ఇంకేముందు అల్లుడు నికిత్ ఆ వంటకాలను లెక్కేసి ఒక వంటకం తగ్గిందని చూపించి పందెంలో తులం బంగారం గెలుచుకున్నాడు. కొత్త అల్లుడికి 101వంటకాలతో మర్యాద చేయబోయే..తులం బంగారం సమర్పించుకున్నప్పటికి..మొత్తానికి మా ఆల్లుడు లెక్కల్లో ఘటికుడేనంటూ ఆత్తమామలు మురిసిపోయారు.

Exit mobile version