Site icon vidhaatha

Speaker vs BRS MLAs : స్పీకర్ నోటీసులు అందాయి…నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా: గద్వాల ఎమ్మెల్యే బండ్ల

Gadwal-MLA-Bandla-Speaker-Gaddam-Prasad

Speaker vs BRS MLAs  | విధాత : పార్టీ ఫిరాయించిన 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు(BRS MLA) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad) నోటీసులు జారీ చేశారు. నాకు స్పీకర్ నోటీస్ అందిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణా మోహన్ రెడ్డి(Gadwal MLA Bandla Krishna Mohan Reddy) వెల్లడించారు. నోటీసులపై న్యాయనిపుణులతో చర్చించి సమాధానమిస్తానన్నారు.నేను ఇంకా టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందన్నారు.

పార్టీ ఫిరాయించిన 10మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్(Danam Nagender), కడియం శ్రీహరి(Kadiyam Srihari), పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy), అరికె పూడి గాంధీ(Arik Pudi Gandhi), తెల్లం వెంకట్రావు(Tellam Venkat Rao), సంజయ్ కుమార్(Sanjay Kumar), కాలే యాదయ్య(Kale Yadayya), ప్రకాశ్ గౌడ్(Prakash Goud), బండ్ల కృష్ణామోహన్ రెడ్డి(Bandla Krishnamohan Reddy), గూడెం మహిపాల్ రెడ్డిల(Gudem Mahipal Reddy)పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై మూడునెలల్లో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జూలై 25న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపధ్యంలో న్యాయనిపుణులతో చర్చించిన స్పీకర్ సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పును గౌరవించి విచారణ చేపట్టాలని నిర్ణయించుకుని తొలి విడతగా 5గురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయనున్నారు. అయితే ఇప్పటికి ఆ 10మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ రికార్డుల మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతుండగా..దానం నాగేందర్ మాత్రం లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.

Exit mobile version