Site icon vidhaatha

కొండా సురేఖపై మేధావులు, సినీ ఇండస్ట్రీ తీవ్ర ఆగ్రహం

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సమంత(Samantha)ల విడాకులకు కేటీఆరే కారణమంటూ తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ(Konda suresha) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సంబంధం లేని వారిని వారి స్వంత రాజకీయాలలోకి లాగడంపై సురేఖను సోషల్​ మీడియాలో ఓ రేంజ్​లో ఆడుకుంటున్నారు. తన భర్త కొండా మురళి(Konda Murali) నడిరోడ్డుపై ప్రత్యర్థులను నరకడం, గడ్డివాముల్లోకి మనుషులను విసిరేసి తగులబెట్టడం లాంటివి చేసినప్పుడు ఎటు పోయింది నీ వ్యక్తత్వమని ప్రశ్నిస్తున్నారు. గీసుకొండ మెయిన్​రోడ్డు మీద కేసీఆర్(KCR)​పై దుమ్మెత్తిపోస్తూ, బూతులు తిట్టినప్పుడు ఏమైంది నీ వ్యక్తిత్వమని, అధికారం కోసం పార్టీలు మారే నువ్వు వ్యక్తిత్వం గురించి మాట్లాడం విడ్డూరమని పలువురు విమర్శిస్తున్నారు.

మరోపక్క సినీనటుడు, అక్కినేని కుటుంబ పెద్ద నాగార్జున(Akkineni Nagarjuna) తన కుటుంబాన్ని వారి గొడవలోకి లాగడంపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసారు. సీనీనటుడు ప్రకాశ్​రాజ్(Prakash Raj)​ సురేఖ చేసిన కామెంట్లను అసహ్యించుకుంటూ ఎక్స్​లో పోస్ట్​ పెట్టారు. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు? సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా? అని ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ విద్యావేత్త, టిఎస్​పిఎస్​సి మాజీ చైర్మన్​ ఘంటా చక్రపాణి(Ghanta Chakrapani) సురేఖ తీరును ఘాటుగా విమర్శించారు. ఆ సంగతి మేకెవరు చెప్పారు? విడాకుల పత్రంలో అలా ఏమైనా రాసుందా? మీరే సాటి మహిళను గౌరవించనప్పుడు, దాన్ని మీరు ఆశించడం తప్పు కాదా? చక్రపాణి సూటిగా ప్రశ్నించారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి ఈ బూతుపురాణం (Filthy Language) ఎక్కువైపోయిందనీ, అసెంబ్లీలో, రోడ్డు మీద, మీడియా ముందు, ఆఖరుకి మీడియాను కూడా బూతులు తిట్టే సంస్కారం పెంచి పోషిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి(Revanth Reddy) మొదలుపెట్టిన ఈ పురాణాన్ని మంత్రులందరూ, అఖరికి మహిళామంత్రులు కూడా కొనసాగించడంపై తీవ్ర అసహ్యాన్ని వెలిబుచ్చుతున్నారు.

సిని పరిశ్రమ పెద్దలు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఈ విషయంతో వారు మరింత ఆగ్రహానికి గురవుతున్నారు.

Exit mobile version