Site icon vidhaatha

TG Family Digital Card | ప్ర‌తి కుటుంబానికి ఓ క్యూఆర్ కోడ్..! ఇక‌ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుతో ఆర్టీసీ బ‌స్సుల్లో ఫ్రీ జ‌ర్నీ..!!

TG Family Digital Card | రాష్ట్ర ప్ర‌భుత్వం( State Govt ) అమ‌లు చేసే ప్ర‌తి సంక్షేమ ప‌థ‌కం( Welfare Scheme ).. చివ‌రి కుటుంబం( Family ) వ‌ర‌కు అందించాల‌నే సంక‌ల్పంతో రేవంత్ స‌ర్కార్( Revanth Govt ) ముందుకు వెళ్తోంది. ప్ర‌తి ఒక్క కుటుంబానికి ప్ర‌భుత్వ సంక్షేమ ఫ‌లాలు అందించాల‌నే ఉద్దేశంతో.. ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు( Family Digital Card )ల‌ను జారీ చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం( Congress Govt ) క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టింది. ఇప్ప‌టికే సికింద్రాబాద్ ప‌రిధిలోని కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుకు సంబంధించి పైలట్ ప్రాజెక్టును ఇటీవ‌లే సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రారంభించారు.

అయితే ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులో ఏయే అంశాలు ఉండాలి.. ఏయే ప‌థ‌కాల‌ను ఈ కార్డులో చేర్చాల‌నే విష‌యాల‌పై ప్ర‌భుత్వానికి స్ప‌ష్ట‌త ఉంది. ప్ర‌తి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్‌( QR Code )ను ఏర్పాటు చేస్తారు. ఆధార్ కార్డు( Aadhar Card ) త‌ర‌హాలో ప్ర‌తి డిజిట‌ల్ కార్డుకు ఒక నెంబ‌ర్ కేటాయిస్తారు. కుటుంబంలోని స‌భ్యులంద‌రికీ కూడా ప్ర‌త్యేక నెంబ‌ర్లు కేటాయించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో రేష‌న్ కార్డులు( Ration Cards ), ఆరోగ్య శ్రీ( Arogya Sree ) కార్డులు వేర్వేరుగా ఉన్నాయి. ఇలా విడివిడిగా కాకుండా.. అన్నింటికి ఒకే కార్డును తీసుకురావాల‌నే ఉద్దేశంలో ప్ర‌భుత్వం ఉంది. ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులో ప్ర‌స్తుత‌మున్న రేష‌న్, ఆరోగ్య శ్రీతో పాటు మ‌హాల‌క్ష్మి ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌ను కూడా అనుసంధానం చేసేందుకు ప్ర‌భుత్వం యోచిస్తోంది. ప్ర‌స్తుతం తెలంగాణ వ్యాప్తంగా 89 ల‌క్ష‌ల‌కు పైగా రేష‌న్ కార్డులు ఉన్న‌ట్లు అధికారుల స‌ర్వేలో తేలింది. ముందుగా రేష‌న్ ల‌బ్దిదారుల‌ను ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల్లో చేర్చ‌నున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రస్తుతం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌( Gas Cylinder ) పథకం అమలవుతోంది. ఆ వివరాలను కూడా డిజిటల్‌ కార్డులో తొలి దశలోనే అనుసంధానం చేయనున్నారు. ఆ తర్వాత గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, పింఛన్ల వంటి పథకాలను చేర్చనున్నారు.

ఆర్టీసీ బ‌స్సుల్లో ఫ్రీ జ‌ర్నికి కూడా డిజిట‌ల్ కార్డే..

ఇక కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అమ‌లు చేసిన తొలి గ్యారెంటీ.. ఆర్టీసీ బ‌స్సుల్లో( RTC Buses ) మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం( Free Journey ). ఈ ప్ర‌యాణానికి ఆధార్ కార్డు లేదా ఓట‌ర్ ఐడీ కార్డు( Voter ID Card ) చూయిస్తున్నారు. ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు( Family Digital Card ) అందుబాటులోకి వ‌స్తే ఆధార్, ఓట‌ర్ కార్డుతో ప‌ని లేకుండా పోతోంది. ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుతో ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌లు ఫ్రీగా ప్ర‌యాణం చేయొచ్చు. భవిష్యత్‌లో ఏదైనా పథకం కోసం ద‌ర‌ఖాస్తు చేయాల్సి వస్తే ఆధార్‌ సమర్పించడం వంటివి చేయాల్సిన పని లేదు. డిజిటల్‌ కార్డులోని ఆ కుటుంబ సభ్యుడి, సభ్యురాలి యూనిక్‌ సంఖ్యను నమోదు చేస్తే సరిపోతుంది.

Exit mobile version