TGSRTC | ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. ద‌స‌రా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

TGSRTC | ద‌స‌రా సెల‌వుల్లో( Dasara Holidays ) మీరు విజ‌య‌వాడ( Vijayawada 0 వెళ్లాల‌నుకుంటున్నారా..? అక్క‌డున్న శ్రీక‌న‌క‌దుర్గ( Sri Kanaka Durga ) అమ్మ‌వారిని ద‌ర్శించుకోవాల‌నుకుంటున్నారా..? అయితే టీజీఎస్ ఆర్టీసీ( TGSRTC ) అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • Publish Date - September 16, 2025 / 05:30 PM IST

TGSRTC | హైద‌రాబాద్ : మ‌రో ఐదు రోజుల్లో ద‌స‌రా సెలవులు( Dasara holidays ) వ‌చ్చేస్తున్నాయ్.. ఇక సొంతూర్ల‌కు వెళ్లేందుకు ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌వుతుంటారు. కొంద‌రేమో తీర్థ‌యాత్ర‌ల‌కు, పుణ్య‌క్షేత్రాల‌కు వెళ్లేందుకు ప్లానింగ్ చేసుకుంటారు. అలాంటి వారి కోసం టీజీఎస్ ఆర్టీసీ( TGSRTC ) శుభవార్త చెప్పింది.

విజ‌య‌వాడ‌( Vijayawada )తో పాటు అక్క‌డున్న శ్రీ క‌న‌క దుర్గ( Sri Kanaka Durga ) టెంపుల్‌ను సంద‌ర్శించాల‌నుకునే వారికి టీజీఎస్ ఆర్టీసీ ప్ర‌త్యేక వెసులుబాటు క‌ల్పించింది. చివ‌రి నిమిషంలో హ‌డావుడి ప‌డ‌డం కంటే.. ముందుగానే టికెట్లు బుక్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ద‌స‌రా సెల‌వుల్లో హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్లాలనుకునే భ‌క్తులు, ప్ర‌యాణికులు.. ఈ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని టీజీఎస్ ఆర్టీసీ సూచించింది. ఆల‌స్య‌మెందుకు.. ఇక ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని, సౌక‌ర్య‌వంతంగా ప్ర‌యాణించండి అని కోరింది. అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల కోసం ఈ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి. https://www.tgsrtcbus.in/